జంక్ ఫుడ్ ను చాలా మంది ఇష్టంగా తింటున్నారు.. కానీ ఇందులోని అధిక చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు ఆరోగ్యానికి హానిచేస్తాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. మరి అవేంటంటే..

మీ భోజనాన్ని ప్లాన్ చేయండి : మీ డైలీ డైట్ లో పౌష్టికాహారాన్ని ఎంచుకోండి. ఆరోగ్యకరమైన ఫుడ్ వల్ల మనసు జంక్ ఫుడ్ వైపు వెళ్లదు. వారానికి ఒక లిస్ట్ వేసుకోండి. ఆ లిస్ట్ ప్రకారం తింటూ అందులో జంక్ ఫుడ్ ను యాడ్ చేయకండి.

హైడ్రేటెడ్ గా ఉండండి : రోజంతా 8-10 గ్లాసుల నీరు తాగండి. కొన్నిసార్లు, బాడీ హైడ్రేటెగ్ గా లేకపోతే ఆకలి జంక్ ఫుడ్‌ను తినాలి అనిపించేలా చేస్తుందట.

ఆరోగ్యకరమైన స్నాక్స్ : గింజలు, పండ్లు, పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్‌ను తినండి. మంచి భోజనం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది. కడుపు నిండుగా ఉండటం వల్ల జంక్ ఫుడ్ జోలికి వెళ్లరు.

 టెంప్టేషన్ మానుకోండి : ఇంటికి, ఆఫీస్ కు దగ్గరలో జంక్ ఫుడ్ ఉంటే.. కాస్త ఆ వైపు చూడటం వాటి గురించి ఆలోచించడం మానుకోండి. లేదంటే టెంప్ట్ అవుతారు జాగ్రత్త.

శ్రద్ద : మీరు తినే వాటిపై శ్రద్ధ వహించాలి. మీ ఆరోగ్యం మీద మీకు శ్రద్ద ఉంటే కచ్చితంగా అనారోగ్యకరమైన ఫుడ్ కు దూరంగా ఉంటారు. సో మీరు సేఫ్

ప్రత్యామ్నాయం : జంక్ ఫుడ్ అలవాటు ఉంటే దీనికి బదులు  పాప్‌కార్న్ లేదా బేక్డ్ వెజిటబుల్ చిప్స్‌ ను తినండి.

ప్రత్యామ్నాయం : జంక్ ఫుడ్ అలవాటు ఉంటే దీనికి బదులు  పాప్‌కార్న్ లేదా బేక్డ్ వెజిటబుల్ చిప్స్‌ ను తినండి.