ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఇల్లాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది. లేకపోతే ప్రతికూలతలే చోటుచేసుకుంటాయి.
Image Credit : pexels
కానీ ఇప్పుడు కాలం మారింది. ఉరుకుల పరుగుల జీవితంలో పరిశుభ్రతను పక్కన పెట్టేశారు. స్నానం చేశాకే పనులు చేయాలనే నియమాన్ని పాటించడం లేదు.
Image Credit : pexels
ఫలితంగా దారిద్ర్యం వెన్నంటే ఉంటుంది. మన పూర్వీకులు స్నానం పూర్తి చేశాకే పనులు చేసుకోవాలనే నిబంధన పెట్టారు. నేడు దాన్ని విస్మరిస్తున్నారు.
Image Credit : pexels
తులసిని తాకకూడదు : మహిళలు స్నానం చేయకుండా తులసి చెట్టును తాకకూడదు. దానికి నీళ్లు పోయకూడదు. స్నానం చేశాకే ఆ చెట్టును తాకి నీళ్లు పోసి పూజలు చేయాలి.
Image Credit : pexels
వంటింట్లోకి వెళ్లరాదు : మహిళలు స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లకూడదు. వంట చేసే పొయ్యిని కూడా లక్ష్మీదేవిగా కొలుస్తుంటాం. అందుకే స్నానం చేయకుండా వంటింట్లోకి వెళ్లడం, వంట చేయడం అంత మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
Image Credit : pexels
తల దువ్వకూడదు : చాలా మంది ఇంట్లో వెంట్రుకలు విరబోసుకుని ఉంటారు. అలా ఉండకూడదు. ఇంట్లో జుట్టు విప్పకూడదు. దువ్వకూడదు. జుట్టు దువ్వుకోవాలంటే స్నానం చేసిన తరువాత మాత్రమే దువ్వుకోవాలి.
Image Credit : pexels
అది కూడా ఇంట్లో కాదు. ఇంటి బయట జుట్టు దువ్వుకోవాలి. కొందరు నడింట్లోనే జుట్టు దువ్వుతుంటారు. ఇది కరెక్టు కాదు. దారిద్ర్యం పట్టుకుంటుంది. లక్ష్మీ కటాక్షం కావాలంటే ఇంట్లో జుట్టు దువ్వడం సరైంది కాదు.
Image Credit : pexels
డబ్బు లెక్కపెట్టడం : స్నానం చేయకుండా డబ్బు ముట్టుకోకూడదు. లెక్కపెట్టకూడదు. స్నానం చేశాక డబ్బు ముట్టుకోవాలి. లేదంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదు.
Image Credit : pexels