రోజుకు ఒక ఎగ్ తినాలి అని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. ఎగ్ ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా అందాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఈ ఎగ్ తో మరికొన్ని ఇంగ్రేడియన్స్ ను కలిపితే ఫలితాలు అద్భుతం. ఇంతకీ ఏం కలపాలంటే..

Image Credit : google

గుడ్డు, ఆలివ్ నూనె : 1-2 గుడ్లను కొట్టి దానికి కాస్త ఆలివ్ నూనెను కలిపి.. ఈ మిశ్రమాన్ని తడి జుట్టుకు పట్టించాలి. 20-30 నిముషాలు అలాగే ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఎప్పటిలాగే షాంపూ చేసుకోవాలి. ఈ ప్యాక్ వల్ల జుట్టు పోషణ మెరుగవుతుంది.

Image Credit : google

గుడ్డు-పెరుగు : పెరుగుకు మీ జుట్టు సైజ్ ను బట్టి ఒకటి లేదా రెండు గుడ్లను కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి, సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత ఓ 20 నిమిషాలు వదిలేసి స్కాల్ప్ ను క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల హెల్తీగా హెయిర్ గ్రోత్ అవుతుంది.

Image Credit : google

గుడ్డు- తేనె : తేనెకు 1-2 గుడ్లు కలిపి.. జుట్టుకు పట్టించాలి. ఓ 20-30 నిమిషాలు అలాగే ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ మాస్క్ మాయిశ్చరైజ్ చేయడానికి నిస్తేజమైన జుట్టుకు మెరుపును జోడించడానికి సహాయపడుతుంది.

Image Credit : google

గుడ్డు-అరటి మాస్క్ : 1-2 గుడ్లను పండిన అరటిపండుతో బాగా కలపండి. జుట్టుకు అప్లై చేసి, కడిగే ముందు 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ జుట్టు పోషణ, కండిషన్స్, మృదువుగా మారడానికి సహాయం చేస్తుంది.

Image Credit : google

గుడ్డు-కొబ్బరి నూనె : కొబ్బరి నూనెతో 1-2 గుడ్లను కలపి జుట్టుకు పట్టించాలి. నెత్తిమీద చివరలపై కూడా పట్టించాలి. షాంపూతో కడిగే ముందు 30 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

Image Credit : google

గుడ్డు : ఒక ఎగ్ ను కొట్టి నీటితో బాగా కరిగించండి. షాంపూ కండిషనింగ్ తర్వాత ఈ మిశ్రమంతో ఒకసారి చివరిగా శుభ్రం చేసుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉంచి ఆ తర్వాత కడిగేయండి. దీని వల్ల మెరుపు, మృదుత్వం రెండు సంతరించుకుంటాయి.

Image Credit : google

గుడ్డు- కలబంద : తాజా కలబంద జెల్‌తో 1-2 గుడ్లను కలపి.. జుట్టు చివర్లకు తలకు అప్లై చేసి 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఈ మాస్క్ స్కాల్ప్ ను శాంతపరచి, ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

Image Credit : google