చంద్రబాబు 2014లో అమరావతిని ప్రారంభించారు. 2024లో మళ్లీ సీఎం అయ్యారు.. ఆయన తలపెట్టిన ఐకానిక్ నిర్మాణాలివీ..

 ఐకానిక్ టవర్స్ : అమరావతిలో ఐకానిక్ టవర్స్  నిర్మాణం పూర్తయింది. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది నివాసం ఉండేలా  తీర్చిదిద్దారు.

కీలక నిర్మాణాలు :  టిడిపి ప్రభుత్వ హయాంలో తలపెట్టిన విభాగాధిపతులు, సచివాలయం, శాశ్వత హైకోర్టు భవనాలు ఐదేళ్లలో   పూర్తిచేయాలి.

పెండింగ్ భూ సేకరణ:  రాజధాని నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ అంశం పెండింగ్లో ఉంది. రైతులకు కేటాయించిన ప్లాట్లు, వాటికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను సత్వరమే పరిష్కరించాలి.  

రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు :  రైతుల రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను తక్షణం పూర్తి చేయాలి. వాటిని అన్ని వస్తువులతో అభివృద్ధి చేయాలి.

సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం :  అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం అత్యంత కీలకం. దానికి అనుసంధానంగా రహదారుల నిర్మాణం పూర్తి చేయాలి 

ఎన్ఐడి, ఎస్ఆర్ఎం, విట్ తదితర ప్రతిష్టాత్మక సంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.   రాజధానిలో సాగునీరు, తాగునీటి అవసరాల తీర్చాలి.