వర్షాకాలం దోమల సీజన్‌.. ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. చిన్న దోమేకదా అని వాటితో వచ్చే జ్వరాలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. రావొచ్చు. 

-అనాఫిలిస్‌ దోమ మంచినీటి నిల్వలలో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.

-క్యూలెక్స్‌ మురుగు నీటి నిల్వలలో పెరిగి మెదడు వాపు, బోద కాలు వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

-ఏడీస్‌ ఇంటి పరిసరాలలోని చిన్న చిన్న నీటి నిల్వలలో పెరిగి చికున్‌ గున్యా, డెంగ్యూ వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

-మాన్సోనియా మెక్కలున్న నీటి నిల్వలలో పెరిగి బోద వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.

-అర్మిజరిన్‌ సెప్టిక్‌ ట్యాంక్‌లు, పారిశ్రామిక వ్యర్థాలలో పెరుగుతాయి. ఈ దోమలతో ఎలాంటి వ్యాధులు వ్యాప్తి చెందనప్పటికీ, ఇవి పీల్చే రక్తం ఎక్కువ మోతాదులో ఉండడంతో శరీరం బలహీనంగా మారుతుంది.

-క్యూ లెక్స్ హఠాత్తుగా విపరీతమైన జ్వరం వస్తుంది. విస్తారమైన నీటి నిల్వలలో పెరిగే క్యూలెక్స్‌ దోమతో ఈ వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది.  చిన్న పిల్లలకు తొందరగా సోకి మరణాలవరకు తీసుకెళ్తుంది.  

దోమల నివారణకు :  పంట పొలాలు, ఖాళీ స్థలాలు, పెద్ద పెద్ద మైదానాలలో నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా జాగ్రతలు తీసుకోవాలి. వ్యాధి నివారణకు ఇచ్చే టీకాలు వేయించుకోవాలి.