వాకింగ్ చేయడం ఎంత ముఖ్యమో.. దాన్ని సరిగ్గా చేయడం కూడా అంతే ముఖ్యం. మరి ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఎంత దూరం వాకింగ్ చేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Image Credit : google

30 నిమిషాలు : మీరు వాకింగ్ మొదలు పెడితే రోజుకు కనీసం 30 ని.లు అయినా వాకింగ్ చేయండి. దాదాపు 1-2 కిలోమీటర్లు నడవాలి.ఇలా చేయడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

Image Credit : google

పెంచాలి : క్రమంగా మీరు నడిచే దూరం పెరగాలి. నిమిషాలు, కి. మీటర్లు పెంచుతూ పోవాలి. కానీ ఈ విషయంలో స్ట్రెస్ అవకూడదు. సులభంగా చేస్తేనే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Image Credit : google

వాకింగ్ చేస్తున్నప్పుడు మీ శరీరంలో వచ్చే మార్పులు ఆటొమెటిక్ గా దూరాన్ని పెంచుతాయి. మీరు ఫిట్‌నెస్ అవుతున్న కొద్ది మరింత హుషారుగా చేస్తుంటారు. అందుకు ప్రారంభంలో చేసే వాకింగ్ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

Image Credit : google

ఏ సమయం : ఉదయం సమయంలోనే వాకింగ్ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో చల్లటి ఉష్ణోగ్రత, తాజా గాలి, ప్రశాంతమైన వాతావరణం ఆస్వాదించడానికి బాగుంటాయి. ఈ వాతావరణం మనసుకు హాయిని అందిస్తుంది.

Image Credit : google

సిద్దం అవడం : వాకింగ్ కు ముందు స్ట్రెస్ గా ఉండకండి. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచిన తర్వాత నీరు తాగండి. దీని వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. ముందు రోజు రాత్రి సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోండి.

Image Credit : google

ప్రయోజనం : క్రమం తప్పకుండా నడవడం రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Image Credit : google

క్యాలరీ బర్నింగ్ : నడవడం వల్ల కేలరీలను బర్న్ అవుతాయి. వాకింగ్ దూరాన్ని క్రమంగా పెంచడం వల్ల క్యాలరీలు మరింత తగ్గే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలి అనుకునే వారికి సరైనది వాకింగ్.

Image Credit : google