Image Credit : pexels
Image Credit : pexels
జుట్టుకు మంచిదా : నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇందులో ఒమేగా -3, ఒమేగా -6 సమృద్ధిగా ఉంటుంది. నువ్వుల నూనె జుట్టు పల్చబడడాన్ని నివారిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Image Credit : pexels
దీన్ని ఎలా వాడాలి : ఈ నూనెను నేరుగా లేదా ఏదైనా ఇతర సహజ నూనెతో కలపి జుట్టుకు అప్లే చేసుకోవచ్చు. నువ్వుల నూనెను తీసుకొని మీ తలను 15-20 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.
Image Credit : pexels
మెరుగైన కండిషనింగ్ : మంచి కండిషన్డ్ జుట్టు కావాలి అనుకుంటే నువ్వుల నూనెను కొబ్బరి లేదా బాదం నూనెతో కలిపి తలకు అప్లే చేసి సుమారు 30-40 నిమిషాలు అలాగే వదిలేసి, ఆపై తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోండి.
Image Credit : pexels
వేపనూనెతో : నువ్వులు, వేప నూనెను సమానంగా తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తేలికపాటి క్లెన్సర్‌తో కడిగేయండి.
Image Credit : pexels
తేమను ఇస్తుందా: నువ్వుల నూనె మీ జుట్టును మృదువుగా చేస్తుంది. మృదువుగా కనిపించేలా చేస్తుంది, ఎందుకంటే ఇందులో కొవ్వు ఆమ్లాలు స్కాల్ప్‌ను తేమగా చేస్తాయి. జుట్టును పొరలుగా లేదా పొడిబారకుండా నిరోధిస్తాయి.
Image Credit : pexels
డీప్ కండీషనింగ్ : జుట్టు రోజు ఎన్నో విధాల బ్యాక్టీరియాను, దుమ్ము ధూళిని ఎదుర్కొంటుంది. నువ్వుల నూనె మన స్కాల్ప్‌లోకి లోతుగా చొచ్చుకుపోతుంది. అయితే ఇది ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది కాబట్టి మీ జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది.
Image Credit : pexels
రక్షణ : నువ్వుల నూనె UV కిరణాల వంటి పర్యావరణ కారకాల నుంచి మీ జుట్టును రక్షిస్తుంది. మీ జుట్టుకు సహజమైన సన్‌స్క్రీన్‌గా ఉపయోగపడుతుంది.
Image Credit : pexels
ఎన్ని సార్లు వాడాలి : నువ్వుల నూనెను వారానికి రెండుసార్లు వాడాలి. దీని వలన స్కాల్ప్ ఆరోగ్యం మెరుగు అవుతుంది. విటమిన్ ఇ, బి-కాంప్లెక్స్‌తో నిండి ఉన్న ఈ నూనె మీ జుట్టును పెంచుతుంది.
Image Credit : pexels
ప్రయోజనాలు : మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఒమేగా-6 ల మిశ్రమం నువ్వుల నూనె. అందుకే ఇవి మీ తలకు అందాలంటే దీన్ని ఉపయోగించండి.