రోజు అలవాట్లు, జీవనశైలి మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంటాయి. అయితే సంతోషంగా జీవించడానికి కొన్ని అలవాట్లను మానుకోండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

ఓవర్ థింకింగ్ : అతిగా ఆలోచించడం అసలు మంచిది కాదు. దీని నుంచి బయటపడటం చాలా సులభం. కానీ జరిగిన సంఘటనలను, జరగబోయే సంఘటనలను అతిగా ఆలోచిస్తే ఇబ్బంది పడతారు.

ఫిర్యాదు : కొందరికి నిత్యం ఫిర్యాదు చేసే గుణం ఉంటుంది. దీని వల్ల మీ ప్రశాంతతను మీరు కోల్పోతారు. ఒకరిలో మంచిని తెలుసుకుంటూ వారితో సంతోషంగా ఉండండి. కానీ ప్రతిసారి నెగిటివ్ గా ఆలోచించడం వల్ల మీరు మనశ్శాంతిగా ఉండరు.

కూర్చోవడం : గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూలంగా ప్రభావితం పడుతుంది. దీనివల్ల నీరసంగా అవుతారు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

ఉదయం హడావిడి : ఉదయం ఉదయమే హడావిడిగా ఉంటే శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది ఒత్తిడికి కారణమవుతుంది. మీ పనిని ప్రారంభించే ముందు త్వరగా మేల్కొని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

మల్టీ టాస్కింగ్ : మల్టీ టాస్కింగ్ మిమ్మల్ని ఓవర్‌లోడ్ చేసి అలసటగా అనిపించేలా చేస్తుంది. ఇది శారీరక, మానసిక అలసటకు దారితీస్తుంది.

ఒంటరి : కొందరు ఎప్పటికీ ఒంటరిగా ఉంటారు. ఎవరితో మాట్లాడకుండా, ఎక్కువగా మాట్లాడకుండా ఉంటారు. ఇలా ఉండటం వల్ల ఏదో కోల్పోయినట్టుగా, ఆనందం లేకుండా ఉంటారు. అందుకే సంతోషంగా ఇతరులతో గడపాలి.

మరి ఈ అలవాట్లు మీకు ఉంటే పక్కన పెట్టేసి కాస్త ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి. దీని వల్ల మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది.