టి20 వరల్డ్ కప్ ఉత్కంఠ గా సాగుతోంది. సూపర్ -8 లో పోరు లోనూ సంచలనాలు నమోదవుతున్నాయి. అయితే ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్ లో అరుదైన ఘనతలను సొంతం చేసుకున్న ఆటగాళ్లను ఒక్కసారి పరిశీలిస్తే..

విరాట్ కోహ్లీ ఈ టీమిండియా స్టార్ ఆటగాడు టి20 వరల్డ్ కప్ లో 1141 పరుగులు సాధించాడు..81.50 సగటుతో 14 అర్థ సెంచరీలు బాదాడు.

బ్రెండన్ మెకల్లమ్ న్యూజిలాండ్ ఆటగాడు మెకల్లమ్ 2012 టి20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై 123 రన్స్ చేశాడు. టి20 వరల్డ్ కప్ లో ఇదే హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతోంది. 

క్రిస్ గేల్ వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు గేల్ 2007లో దక్షిణాఫ్రికా, 2016లో ఇంగ్లాండ్ జట్లపై సెంచరీలు బాదాడు. మరే ఆటగాడు ఈ ఘనతను సాధించలేదు. 

షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ బౌలర్ షకీబ్ అల్ హసన్ టీ 20 వరల్డ్ కప్ పోరులో హసన్ 47 వికెట్లు పడగొట్టాడు. 36 మ్యాచ్ లలో ఈ ఘనత సాధించాడు. 

క్రిస్ గేల్.. గేల్ టి20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. గేల్ ఏకంగా 63 సిక్సర్లు కొట్టాడు.

విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ టి20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక ఆర్ధ సెంచరీలు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడి ఖాతాలో 14 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

ఏబీ డివిలియర్స్ దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ఉన్నాడు.2007 నుంచి 2016 వరకు 23 క్యాచ్ లు పట్టాడు.

రోహిత్ శర్మ టి20 ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇతడు ఏకంగా 42 మ్యాచ్ లలో ఆటగాడిగా, కెప్టెన్ గా కొనసాగాడు.