మొదటి సినిమాతోనే హిట్.. ఆపై కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్స్ గా మారింది వీళ్లే..!

కొందరు హీరోయిన్ లు తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్ హీరోయిన్లుగా మారిపోతుంటారు. అలా మొదటి సినిమాతోనే హిట్టు కొట్టి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిన హీరోయిన్ల జాబితాపై ఓ లుక్కేయండి.. 

మృణాల్ ఠాకూర్ :   సీతారామం సినిమాతో టాలీవుడ్లోకి  అడుగుపెటి బ్లాక్ బస్టర్ హిట్టందుకుంది. ఈ మూవీ హిట్టుతో మృణాల్ ఠాకూర్ క్రేజీ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది.

కీర్తి సురేశ్ : నేను శైలజ మూవీతో కీర్తి సురేశ్ టాలీవుడ్ కి పరిచమైంది. ఈ మూవీలో ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు. మహానటితో జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

కృతిశెట్టి : ఉప్పెన సినిమాతో కృతి శెట్టి తెలుగులో ప్రేక్షకుల మనుసును గెలుచుకుంది. చాలామంది కుర్రాళ్లకు ఫేవరేట్ గా మారిపోయింది. ఓరచూపులు, కొంటె నవ్వులతో కుర్రాళ్లను ఫిదా చేస్తోంది.

ఇవానా : లవ్ టుడే అనే రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ లో ఇవానా నటించింది. ఈ మూవీలో తన నటనతో సౌత్ కుర్రాళ్లను తనవైపుకు తిప్పుకుంది. ఈమె కూడా మంచి ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది.

వైష్ణవి : బేబీ అనే రొమాంటిక్ డ్రామా చిత్రంలో కథానాయకిగా వైష్ణవి చైతన్య నటించింది. ఈ మూవీలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన వైష్ణవి తన తొలి సినిమానే మంచి హిట్టందుకుంది.

శివాని : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో శివాని నాగరం తొలిసారి హీరోయిన్ గా పరిచయమైంది. తన నటనతో కుర్రాళ్ల చూపును తనవైపు తిప్పుకుంది.

అననతిక :  మలయాళీ బ్యూటీ అననతిక సనీల్‌కుమార్ తొలి సినిమా మ్యాడ్‌ లో జెన్నీగా నటించింది. ఈ భామ సైతం తెలుగు కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించింది.

మమితా బైజు :  రీసెంట్ గా వచ్చిన ‘ప్రేమలు’ సినిమాలో హిరోయిన్ గా మమితా బైజు నటించింది. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకోవడంతోపాటు కుర్రాళ్ల మనుసు దోచేసింది