2007లో టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన నాటి నుంచి మొన్నటి టోర్నీ దాకా.. ఆతిధ్య దేశాలు ఒక్కసారి కూడా దక్కించుకోలేదు. 

Image Credit : Instagram

2007లో సౌత్ ఆఫ్రికా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. తొలి ఎడిషన్ లో ధోని ఆధ్వర్యంలోని టీమిండియా విజేతగా ఆవిర్భవించింది.  

Image Credit : Instagram

2009లో ఇంగ్లాండ్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో పాకిస్తాన్ విజేతగా నిలిచింది.   

Image Credit : Instagram

2010లో వెస్టిండీస్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ మెగా టోర్నీలో ఇంగ్లాండ్ తొలిసారిగా విజేతగా ఆవిర్భవించింది. 

Image Credit : Instagram

2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తొలిసారి విన్నర్ గా నిలిచింది. 

Image Credit : Instagram

2014లో బంగ్లాదేశ్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో శ్రీలంక తొలిసారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై గెలిచారు.

Image Credit : Instagram

2016లో భారత్ వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో వెస్టిండీస్ మరోసారి విజేతగా ఆవిర్భవించింది. 

Image Credit : Instagram

2021లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్ దేశాల వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహించారు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా తొలిసారి విజేతగా నిలిచింది. 

Image Credit : Instagram