ప్రస్తుతం అందాన్ని, జుట్టును కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది కదా. వీటి కోసం బ్యూటీపార్లల్ లో ఫుల్ డబ్బులు వెచ్చిస్తుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా కేవలం వేపాకుతో రెండు సాధ్యం. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో లుక్ వేయండి.

జిడ్డు చర్మం : జిడ్డు చర్మం ఉన్న వారు వేప ఫేస్ వాష్‌ను ఉపయోగించవచ్చు. సెబమ్ ఉత్పత్తిని తొలగించి సహజ ఆస్ట్రిజెంట్ లక్షణాలతో త్వరగా స్కిన్ ను రక్షిస్తుంది. మొటిమలు ఏర్పడకుండా చేస్తుంది.

చర్మం కాంతి:  తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు మొహం రంగు మారడం వంటి వాటిని నివారిస్తుంది వేప. అంతేకాదు చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

మాయిశ్చరైజర్‌ : వేప నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన తేమతో కూడి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.

చుండ్రు: యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో ఉంటుంది వేప. ఇది చుండ్రు, ఇతర జుట్టు సమస్యలను తొలగిస్తుంది.

జుట్టు పెరుగుదల: రిచ్ ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు స్కాల్ప్‌కు పోషణనిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

హెయిర్ కండీషనర్‌: వేప నూనె జుట్టుకు చక్కటి మెరుపు, మృదుత్వాన్ని అందిస్తుంది. నిగనిగలాడేలా చేస్తుంది. మంచి కండీషనర్, మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

స్కాల్ప్ హెల్త్: వేపలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చికాకు, దురదను తగ్గిస్తాయి, అలాగే శుభ్రమైన జుట్టుతో ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.