Image Credit : pexels
Image Credit : pexels
జుట్టు ఆరోగ్యం పెరగాలంటే జుట్టును కత్తిరిస్తుండాలట. చిట్టినా, డ్యామేజ్ అయిన జుట్టును కత్తిరించడం వల్ల మీ జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. డ్యామేజ్ అయినా జుట్టు ఆరోగ్యకరమైన జుట్టును దెబ్బతీస్తుందట. అందుకే ఇలాంటి జుట్టును కట్ చేయాలి.
Image Credit : pexels
మీరు హెయిర్ స్టైల్ గా ఉండాలి అనుకుంటే మంచి స్టైల్ కోసం 2-3 నెలలకు ఒకసారి మీ జుట్టును కట్ చేస్తూ ఉండండి. దీనివల్ల జుట్టు నిత్యం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.
Image Credit : pexels
ఇక జుట్టుకు మంచి రూపం రావాలంటే మాత్రం ప్రతి 3-4 వారాలకు ఒకసారి కత్తిరిస్తుండాలట. అంతేకాదు జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే చివర్లు చిట్లి పోకుండా ఉండటానికి ప్రతి 4 నెలలకు కత్తిరించండి.
Image Credit : pexels
జుట్టు కట్ చేసిన తర్వాత మంచి సీరమ్స్ ఉపయోగించాలి. ఉసిరి, రోజ్మేరీ, కొబ్బరి నూనె వంటి సహజ నూనెలను ఉపయోగించండి. ఇవి మృదువైన, సిల్కీ హెయిర్ ను అందించడంలో సహాయం చేస్తాయి.
Image Credit : pexels
చివరలను కత్తిరించడం వల్ల మాత్రమే జుట్టు పెరగదు. స్కాల్ప్ ను బాగా మసాజ్ చేస్తుంటే మాత్రమే మీ హెయిర్ ఫోలికల్స్‌కి రక్త ప్రవాహం సరిగ్గా అంది జుట్టు పెరుగుతుంది.
Image Credit : pexels
చిట్లిన జుట్టును కత్తిరించకుండా, నిర్జీవంగా మారిన జుట్టును కూడా కత్తిరించకుండా అలాగే వదిలేస్తే జుట్టు పెరగడం ఆగిపోతుందట
Image Credit : pexels
అనారోగ్యకరమైన ఆహారం, సరైన జుట్టు సంరక్షణ లేకపోతే కూడా మీ జుట్టు పెరుగుదల మెరుగ్గా ఉండదు. సమతుల్య ఆహారం, సరైన జుట్టు సంరక్షణ ఉంటే మీ జుట్టు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
Image Credit : pexels
జుట్టును కత్తిరించడం వల్ల మాత్రమే పొడవుగా పెరగదట. జుట్టు మూలాల నుంచి పెరుగుతుంది. అయినప్పటికీ, చివర్లను కత్తిరించడం వల్ల చిట్లడాన్ని నివారించవచ్చు. దీనివల్ల జుట్టు ఆరోగ్యం కాపాడవచ్చు.