ఉదయం చాలా సేపు పడుకోకూడదు. కొందరు 9.గం.లు అవుతున్న నిద్ర లేవరు. ఇలా చేయడం చాలా తప్పు.

సూర్యోదయం కంటే ముందే కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి.

నిద్ర లేచిన వెంటనే దుప్పట్లు పక్కకు పెట్టేయాలి. లేదంటే దరిద్ర దేవత ఇంట్లో తిష్గ వేస్తుందట.

బట్టలు పిండిన నీళ్లను కాళ్ల మీద పోసుకోవద్దు. వంట అయిన తర్వాత వెంటనే గిన్నెలు తోమాలి.

ఇల్లు ఊడ్చిన చీపిరిని నిలబెట్టకూడదు. ఇంటి గుమ్మం మీద నిలబడవద్దు.

సంధ్యా సమయంలో నిద్ర పోకూడదు. శృంగారం చేయకూడదు.

శనివారం చెప్పులు, గొడుగు, నువ్వుల నూనె ఇంటికి తీసుకొని రావద్దు.

శనివారం నలుపు రంగు దుస్తులను ధరించవద్దు. పాచి ముఖంతో అద్దంలో చూడవద్దు.