Image Credit : pexels
Image Credit : pexels
50 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న జంటలు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడాన్ని 'గ్రే డైవోర్స్' అంటారు.
Image Credit : pexels
ప్రస్తుతం వృద్దుల్లో కూడా విడాకులు తీసుకోవాలని అనే ఆలోచన ఎక్కువ అవుతుందట. USలో, 1990ల నుంచి 50 అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు డైవర్స్ తీసుకోవాలి అనుకునేవారి సంఖ్య రెండింతలు పెరిగిందట. ఇంతకీ ఇలా పెరగడానికి కారణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం.
Image Credit : pexels
పదవి విరమణ, లేదా ఆ తర్వాత సమయం ప్రస్తుతం ఉన్న భాగస్వామితో గడపడం ఇష్టం లేక ఎప్పటి నుంచో ఉన్న గొడవలు అప్పుడు గుర్తు చేసుకోవడం, లేదా మరింత పెరగడం వంటి కారణాల వల్ల విడాకులు మరింత పెరుగుతున్నాయట.
Image Credit : pexels
పిల్లలు తమ జీవితాల కోసం ఇంటిని వదిలి వెళ్లినప్పుడు, వారి లైఫ్ లో ఉన్న భాగస్వామితో ఇక సంతోషంగా ఉండలేరని నిర్ణియంచుకొని మరీ విడిపోతున్నారట. పిల్లలు వారి కాళ్ల మీద వారు నిలబడి జీవితంలో సెటిల్ అయ్యాక కేవలం వీరి జీవితం గురించి వీరు ఆలోచిస్తున్నారట.
Image Credit : pexels
గతంలో వృద్దులు విడాకులు తీసుకోవడం చాలా కష్టం. కానీ ఇప్పుడు చాలా సులభంగా మారింది. కామన్ గా తయారైంది.అందుకే చాలా మంది వృద్ధులు సమాజంతో సంబంధం లేకుండా తమ ఆనందం కోసం గ్రే విడాకుల బాట పడుతున్నారు.
Image Credit : pexels
విడాకుల నుంచి వచ్చే మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ కొందరికి, తమ జీవితంలో సంతోషం లేనప్పుడు అది దీనికంటే మరింత ఎక్కువ ఒత్తిడికి గురి చేస్తుందట. అందుకే కలిసి ఉండటం కంటే విడిపోవడం ఉత్తమం అనుకుంటున్నారు.
Image Credit : pexels
గ్రే విడాకుల తర్వాత కూడా చాలా మంది వ్యక్తులు తిరిగి వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారట. కొందరి జీవితాలలో ఈ రెండవ వివాహం మరింత విజయవంతం అయిందట.
Image Credit : pexels
వివాహం, విడాకుల పట్ల వైఖరులు అభివృద్ధి చెందాయి. జీవితాన్ని, లైఫ్ స్టైల్ ను నాణ్యతగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి అని ఫిక్స్ అయినప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ బాగలేకపోతే వెంటనే విడాకులు తీసుకుంటున్నారట కొందరు వృద్ధులు.
Image Credit : pexels
వివాహం, విడాకుల పట్ల వైఖరులు అభివృద్ధి చెందాయి. జీవితాన్ని, లైఫ్ స్టైల్ ను నాణ్యతగా, సంతోషంగా, ఆనందంగా జీవించాలి అని ఫిక్స్ అయినప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ బాగలేకపోతే వెంటనే విడాకులు తీసుకుంటున్నారట కొందరు వృద్ధులు.
Image Credit : pexels