యవ్వనంగా ఉండాలంటే తినాల్సిన ఆహారాలు

30 సంవత్సరాలకే 50 సంవత్సరాల వయసు వచ్చినట్టు కనిపిస్తున్నారు.

మీ వయసు కాస్త తగ్గినట్టు కనిపించాలన్నా.. యవ్వనంగా కనిపించాలన్నా ఇప్పుడు చెప్పుకోబోయే ఆహారం తీసుకోండి..

బొప్పాయిలో విటమిన్ ఏ, సి లు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచి, పాపైన్ అనే ఎంజైమ్ ను రిలీజ్ చేస్తాయి. దీని వల్ల శరీరం ముడతలు పడదు.

అవిసె గింజలు:  ఇందులో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మంపై ముడతలు రాకుండా కాపాడతాయి.

టొమాటోలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి సూర్య కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.

వేరుశనగ: పల్లీలలో ఉండే జింక్ ముడతలను నిరోధించి, మచ్చలను తొలగిస్తుంది.

 దోసకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి.. దీన్ని తినడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.