ఎముకలు బలంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహర పదార్థాలు ఇవే!

శరీరానికి అవసరమైన వాటిలో కాల్షియం ఒకటనే సంగతి తెలిసిందే. కాల్షియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీలకర్ర ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.

ప్రతిరోజూ జీలకర్ర వేసిన నీటిని తాగడం ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా కూడా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.

ప్రతిరోజూ బాదంపప్పును తినడం ద్వారా కాల్షియం లోపంను అధిగమించవచ్చు. ప్రతిరోజూ నాన్ వెజ్ తింటే కాల్షియం లోపం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఆహారంలో రాగులను చేర్చుకోవడం ద్వారా కూడా కాల్షియం సమస్యను దూరం చేసుకోవచ్చు. రాగులతో చేసిన ఆహారం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. ఉసిరి కూడా శరీరంలో కాల్షియం సమస్యకు చెక్ పెట్టడంలో తోడ్పడుతుంది.