తాళి బొట్టును ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు. దీనికి సమయం, సందర్భం కచ్చితంగా చూడాలి.

తాళి బొట్టు కూర్చుకోవడానికి శుక్ర, మంగళ, శనివారాలు పనికి రావు అంటారు పెద్దలు. దీనికి గురువారం చాలా మంచి రోజు.

అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులు కూడా మంచివి కావట

ఉదయం 12 గం. ల లోపు రాహుకాలం లేకుండా చూసుకొని మార్చుకుంటే చాలా మంచిది

గొలుసు బంగారం అయినా సరే సూత్రాలు మాత్రం పసుపు తాడుకు మాత్రమే గుచ్చుకోవాలి.

సూత్రాలు కాకుండా నల్లపూసలు, పగడాలు, ముత్యాలు, బంగారు గుళ్లు కలిపి 9 వచ్చేలా చూసుకోవాలి.

తూర్పు వైపుకు తిరిగి కూర్చొని ప్రశాంతంగా అమ్మవారిని స్మరించుకుంటూ కూర్చుకోవాలి.

ఈ ప్రాసెస్ అంతా చేసే లోపు ఒక పసుపు తాడుకు పసుపు కొమ్ము కట్టి దానిని మెడలో ధరించాలి. ఏది లేకుండా ఉండకూడదు.