https://oktelugu.com/

ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్లను సొంతం చేసుకోవాలంటే నోటి పరిశుభ్రత అవసరం. మరి మీ నోటి సంరక్షణ కోసం ఈ చిట్కాలను అనుసరించండి.

Image Source: Google

రోజూ రెండుసార్లు బ్రష్: ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ తోబ్రష్‌ని కనీసం రెండు నిమిషాలు తోమండి. దంతాలు మొత్తం క్లీన్ చేస్తూ ఉదయం సాయంత్రం బ్రష్ చేయండి.

Image Source: Google

ఫ్లాస్ డైలీ: ఆహార కణాలు దంతాల మధ్య ఇరుక్కొని పోతాయి. అందుకే వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చిగుళ్ల వ్యాధి, కావిటీలను నివారించుకోవచ్చు.

Image Source: Google

మౌత్ వాష్:  క్రిమినాశక మౌత్ వాష్ బ్యాక్టీరియాను తగ్గించడానికి, శ్వాసను ఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది.

Image Source: Google

బ్రష్ మార్పు: మీ టూత్ బ్రష్‌ను ప్రతి మూడు, నాలుగు నెలలకోసారి లేదా ముళ్ళగరిగలు చిరిగిపోతే మార్చాలి.

Image Source: Google

దంత పరీక్షలు: ప్రతి ఆరునెలలకోసారి దంతవైద్యుని వద్దకు వెళ్లాలి.  ఏవైనా సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించవచ్చు.

Image Source: Google

చక్కెర ఆహారాలు: దంత సమస్యలకు దారితీసే చక్కెరతో చేసిన స్నాక్స్, పానీయాలు, స్వీట్లు తీసుకోవడం తగ్గించండి.

Image Source: Google

పొగాకు మానుకోండి: ధూమపానం, పొగాకు నమలడం వల్ల చిగుళ్ల వ్యాధి, దంత క్షయం, నోటి క్యాన్సర్ లు వస్తాయి.

Image Source: Google

నీరు: నీరు ఆహార కణాలను తొలగించడానికి, మీ నోటిని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయం చేస్తుంది.

Image Source: Google