నలంద విశ్వవిద్యాలయం గురించి ఎవరికీ తెలియని విశేషాలు మీకోసం..!

బిహార్ లోని రాజ్‌గిర్ లో 450 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ‘నలంద విశ్వవిద్యాలయం’ నూతన క్యాంపస్  ను ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 19న   ప్రారంభించారు. 

 పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘నెట్ జీరో’ గ్రీన్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. ఇందులో 1900 మంది విద్యార్థులు చదువుకునేలా 40 తరగతి గదులు, 300 మంది విద్యార్థులు కూర్చునేలా  రెండు ఆడిటోరియలను ఏర్పాటు చేశారు. 

నలంద యూనివర్సిటీ హాస్టల్ లో  550 మంది విద్యార్థులు ఉండేలా మౌలిక సదుపాయాలను కల్పించారు. 2వేల మంది విద్యార్థుల సామర్థ్యంతో యాంఫిథియేటర్, ఫెసిలిటీ క్లబ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ఆదునాతన సదుపాయాలను యూనివర్సిటీ కలిగి ఉంది.

ఈ క్యాంపస్ అధునాతన మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఈ క్యాంపస్ పురాతన విద్యా కేంద్రానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ క్యాంపస్ ప్రారంభానికి  విదేశాంగ మంత్రి జైశంకర్ సహా పలువురు ప్రముఖులు, వివిధ దేశాల రాయబారులు పాల్గొన్నారు.

పాత నలంద విశ్వ విద్యాలయం నాటి పురాతన రాజ్యం మగధ (ఆధునిక బిహార్)లో  క్రీ.శ ఐదో శతాబ్దంలో నిర్మించారు. ఇది రాజగృహ నగరానికి (ప్రస్తుత - రాజ్గిర్), పాటలీపుత్ర (ప్రస్తుత - పాట్నా) సమీపంలో వుంది.

8వ, 9వ శతాబ్ధాల్లో పాల రాజవంశం ఆధ్వర్యంలో నలంద యూనివర్సిటీ అభివృద్ధి చెందింది. ఇందులో ఆయుర్వేదం, వైద్యం, గణితం, వ్యాకరణం, బౌద్ధం, ఖగోళ శాస్త్రం, భారతీయ తత్వశాస్త్రం వంటి సబ్జెక్టులను విద్యార్థులకుు బోధించేవారు.

 10వేల మందికి పైగా విద్యార్థులు, 2వేలకు మందికి పైగా ఉపాధ్యాయులకు వసతి కల్పించిన ప్రపంచంలోని మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా నలంద యూనివర్సిటీ కీర్తి గడించింది.