పరాఠాలు అంటే చాలా మందికి ఇష్టం. అందులో కొన్ని రుచికరమైన పరాఠాలను మీకోసం ఈ స్టోరీలో ఇస్తున్నాం. ఇవి ప్రోటీన్లు, విటమిన్లను కూడా అందిస్తాయి. ఆలస్యం ఎందుకు ఓ లుక్ వేయండి.

పెసరపప్పు పరాటా ఈ పరాటాను పెసరపప్పుతో చేస్తారు. జీలకర్ర, ధనియాల పొడి, పసుపుతో మసాలా చేసి చేస్తారు. పోషకాలతో నిండుగా ఉంటాయి.

సోయా కీమా పరాటా చాలా రుచికరమైన క్రిస్పీ. పరాటా లోపల తరిగిన కూరగాయలు, సోయా గ్రాన్యూల్స్‌తో తయారు చేస్తారు.

ఆలూ పరాటా ఆలుతో తయారు చేసే ఈ పరాటా సూపర్ గా ఉంటుంది. కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లో అధికంగా ఉండే ఈ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. 

శనగప పప్పురాటా శనగ పప్పు, గోధుమ పిండిలో నింపి, తవా మీద ఉడికించి, మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు.

మిక్స్‌డ్ వెజ్ పరాటా ఫైబర్, ప్రొటీన్‌తో నిండిన రంగురంగుల, పోషకమైన పరాటాను తయారు చేయడానికి గోధుమ పిండితో కలిపిన క్యారెట్, బీన్స్, బఠానీలు, కూరగాయలు కావాలి. 

మేతి పరాటా మెంతి ఆకులను మెత్తగా కోసి, మొత్తం గోధుమ పిండిలో కలపాలి. ఈ పరాటా ప్రొటీన్‌ను అందించడమే కాకుండా మెంతికూర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పనీర్ పరాటా పనీర్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, తాజా కొత్తిమీరతో చస్తారు. ఇది ప్రోటీన్ ను అందిస్తుంది.