వేసవిలో తీసుకునే కొన్ని ఆహారాలను, జ్యూస్ లను వర్షాకాలంలో తీసుకోవాలి అంటే ఆలోచిస్తారు.

కొందరు పెరుగు తింటే ఏం కాదంటే మరికొందరు మాత్రం వర్షాకాలంలో అసలు పెరుగుతినవద్దు అంటారు.

పెరుగులో రైబోఫ్లేవిన్, కేలరీలు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, చక్కెరలు,  ఫాస్పరస్,  విటమిన్ బి12, పొటాషియం ఉంటాయి.

పెరుగు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి,ఎముకలు, దంతాలు బలోపేతం అవుతాయి. బరువు తగ్గుతారు. గుండె ఆరోగ్యానికి, చర్మానికి మేలు.

పెరుగును ఉదయం, మధ్యాహ్నం తినాలి. కానీ రాత్రి సమయంలో తినకూడదు అంటున్నారు నిపుణులు.

ఆయుర్వేద నిపుణులు మాత్రం వర్షాకాలంలో పెరుగు తినవద్దు అంటున్నారు.

పెరుగును వర్షాకాలంలో తింటే శరీరంలో రంధ్రాలు మూసుకుపోతాయట.  దీని వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

ఎక్కువ మొత్తంలో పెరుగు తినకుండా, మంచి పెరుగును మాత్రమే తీసుకోవాలి.