వర్షాకాలంలో లభించే నేరేడు పండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు. కానీ వీటిని తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలట

నేరేడు పండ్లను తిన్న తర్వాత నీరు, పాలు అసలు తీసుకోకూడదట. దీని వల్ల జీర్ణసమస్యలు వస్తాయట. అతిసారం, విరేచనాలు కూడా సంభవించవచ్చు అంటున్నారు నిపుణులు.

ఈ పండ్లు తిన్న 30 నుంచి 40 నిమిషాల తర్వాత నీటిని తాగాలి. ఈ ఫ్రూట్స్ లో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, కాల్షియం, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి.

Image Credit : google

ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్, థయామిన్, సోడియంలో కూడా లభిస్తాయి. ఈ పండ్లను పురాతన కాలం నుంచి ఆయుర్వేద చికిత్సకు ఉపయోగిస్తున్నారు.

Image Credit : google

ఈ పండ్లతో మంచితో పాటు చెడు కూడా ఉందట. వీటిని ఎక్కువ తింటే గ్యాస్,  కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

Image Credit : google

యాంటీఆక్సిడెంట్లు, సి విటమిన్ లభిస్తాయి. కానీ ఎక్కువ తినడం వీటివల్ల దుష్ప్రభావాలు వస్తాయి.

Image Credit : google

మొటిమలు, ముడతలు కూడా పెరుగుతాయి. దీనికి ఆధారాలు లేకున్నా.. మొటిమలతో బాధ పడేవారు కాస్త తక్కువ తినడం బెటర్ అంటున్నారు నిపుణులు.

Image Credit : google

నేరేడు పండ్ల గింజల్లో జాంబోలైన్, జాంబోసిన్ లు ఉంటాయి. ఇవి రక్తంలోని గ్లూకోజ్ ను తగ్గిస్తాయి. ఇన్సులిన్ ను విడుదల చేస్తాయి.  ఇక వీటిని షుగర్ పేషెంట్లు తిన్నా ఎలాంటి సమస్య ఉండదు

Image Credit : google