బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా రాత్రి భోజనం కీలక పాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు.

బరువు తగ్గడాన్ని రాత్రి భోజనంలో తప్పనిసరిగా కొన్ని ఆహారాలను నివారించాల్సిందేనట.

అన్నం: బియ్యంలో పిండిపదార్థాలు,  కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీని వల్ల అధిక క్యాలరీలు కూడా లభిస్తాయి.

వేయించిన ఆహారాలు : రాత్రి భోజనంలో వేయించిన పదార్థాలు తింటే మీకు అధిక క్యాలరీలు లభిస్తాయి. దీని వల్ల బరువు పెరగడంతో పాటు గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది.

షుగర్ ఫుడ్ : చక్కెర ఉండే ఆహారాలు గుండె జబ్బులు, ఊబకాయం, బరువు పెరగడం వంటి దీర్ఘకాలిక పరిస్థితులకు దోహదం చేస్తాయి. అందుకే నైట్ కేకులు, ఐస్ క్రీమ్‌లు, స్వీట్లు తినకండి.

పాల ఉత్పత్తులు : కాటేజ్ చీజ్, జున్ను, వెన్న, పెరుగు, పాలు వంటి పాల ఉత్పత్తులలో అధిక మొత్తంలో లాక్టోస్, సహజ చక్కెర స్థాయిలు ఉంటాయి. ఇవి బరువు పెరిగేలా చేస్తాయి.

బ్రెడ్స్ : గోధుమల నుంచి తయారైన రొట్టెలు, ఇతర పదార్థాలలోసాధారణంగా కేలరీలు, కార్బోహైడ్రేట్లలో ఎక్కువగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు తక్కువగా ఉంటాయి. వీటిని కూడా అవైడ్ చేయండి