వర్షాకాలంలో కూడా ఇక్కడికి వెళ్లాలి అనుకుంటున్నారా?

గోవా గోవా అన్ని సీజన్లలో అందంగా ఉంటుంది కానీ వర్షాకాలంలో ఈ ప్రదేశంచాలా భయంకరంగా ఉంటుంది. భారీ వర్షాల కారణంగా కొన్ని జలపాతాలు, బీచ్‌లు క్లోజ్ చేస్తారు. అందుకే ఇక్కడికి వెళ్లే ముందు  అన్ని వివరాలు తెలుసుకోవాలి.

ముస్సూరీ, నైనిటాల్, (ఉత్తరాఖండ్) వర్షాకాలంలో ఈ హిల్ స్టేషన్లను సందర్శించకూడదు. ఈ ప్రాంతం నిటారుగా ఉంటుంది. కొన్ని సార్లు ఇక్కడ కొండచరియలు విరిగిపడటం, ట్రాఫిక్ జామ్‌ అవడం కూడా జరుగుతుంది.

చిరపుంజి, మౌసిన్‌రామ్, (మేఘాలయ) ప్రపంచంలోనే  అత్యధిక వర్షపాతం ఈ పట్టణాలలో నమోదవుతుంది. పచ్చని ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉన్నా.. తరచుగా కురుస్తున్న వర్షాలకు ఇక్కడి కొండచరియలు విరిగిపడుతుంటాయి. ఇక్కడ కూడా ప్రయాణం సరిగ్గా సాగదు. 

గుజరాత్ గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్ వంటి నగరాలల కూడా వర్షాలు ఎక్కువా కురుస్తాయి. భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ప్రాంతాలలో తక్కువ వర్షపాతం ఉంటుంది. కానీ వర్షాలకు ఇక్కడ వరదలు వస్తాయ. రోజువారీ జీవితానికి అంతరాయం కలిగుతుంది.

ఒడిశా:  ఒడిశా చారిత్రక దేవాలయాలకు, ఇసుక బీచ్‌లకు ప్రసిద్ధి చెందింది. రుతుపవనాల సమయంలో, రాష్ట్రం తుఫానులు, భారీ వర్షపాతాన్ని ఎదుర్కొంటుంది. అందుకే వర్షాకాలంలో ఒడిషాను సందర్శించకుండా ఉండాలని సూచిస్తారు. 

కేరళ:  భారీ రుతుపవనాల వల్ల కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడతాయి. పట్టణ ప్రాంతాలలో వరదలకు కారణమవుతాయి. సందర్శకులు బహిరంగ కార్యకలాపాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. వాతావరణాన్ని పర్యవేక్షిస్తుండాలి. 

అస్సాం:  అస్సాంలోని బ్రహ్మపుత్ర నదీ పరీవాహక ప్రాంతంలో రుతుపవనాల సమయంలో భారీ వర్షాలు కురుస్తాయి. గౌహతి వంటి పట్టణ ప్రాంతాలలో తరచుగా వరదలు, నీటి ఎద్దడి ఏర్పడుతుంది. అందుకే ఈ సమయంలో రవాణా గురించి క్లారిటీ ఉండాలి.

ముంబై, మహారాష్ట్ర రుతుపవనాల సమయంలో ముంబై లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలతో తరచుగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిండిపోతుంది. ట్రాఫిక్ జామ్‌లు, స్థానిక రవాణాలో జాప్యం సర్వసాధారణం.

ముంబై, మహారాష్ట్ర రుతుపవనాల సమయంలో ముంబై లో చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే భారీ వర్షాలతో తరచుగా లోతట్టు ప్రాంతాలలో నీరు నిండిపోతుంది. ట్రాఫిక్ జామ్‌లు, స్థానిక రవాణాలో జాప్యం సర్వసాధారణం.