చాలా మందికి గుండె పోటు రావడం కామన్ గా జరుగుతుంది.

ఎలాంటి నొప్పి లేకుండా సడన్ గా గుండె పోటు రావడం వల్ల కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు.

ఇలా అకస్మాత్తుగా గుండెపోటు రావడానికి కారణాలు కూడా ఉన్నాయి. మరి మీరు ఇలాగే చేస్తే ఇక నుంచి అయినా మారాల్సిందే.

నిద్ర లేకుండా:  నిద్ర లేకపోతే గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట. అందుకే 8 గంటలు నిద్ర పోవాలి.

ఒత్తిడి:  అధిక ఒత్తిడి వల్ల కూడా గుండె పోటు వస్తుందట. వీలైనంత ప్రశాంతమైన జీవితం గడపడానికి ట్రై చేయండి.

ఎనర్జీ డ్రింక్స్:  కొందరు ఎనర్జీ కోసం అంటూ అధికంగా పానీయాలు సేవిస్తుంటారు. ఈ జ్యూస్ లు కూడా మీకు గుండె సమస్యలను తీసుకొస్తాయట.

స్మోకింగ్, డ్రికింగ్:  మద్యపానం, ధూమపానం హానీకరం అంటూ ప్రకటనలు ఇచ్చినా మానేయని మనుషులు ఎందరో. కానీ వీటి వల్ల అకస్మాత్తుగా గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది.

ఊబకాయం:  అత్యధికంగా ఒబిసిటీ ఉంటే కూడా మీరు ప్రమాదంలో ఉన్నట్టే. కాస్త కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుండాలి.