సాధారణంగా టీ, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ ల్లో కెఫెన్ ఎక్కువ ఉంటుంది. ఈ కెఫెన్  ను రోజు వారి లైఫ్ లో ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయట. అవేంటో తెలుసుకోండి.

ఆందోళన - భయం : ఎక్కువ మొత్తంలో కెఫెన్ తీసుకోవడం వల్ల శరీరంలో భయం, ఆందోళన వంటి భావాలు పెరుగుతాయట.

నిద్రలేమి : ఇందులో ఉండే కెఫిన్ నిద్ర పోనివ్వకుండా చేస్తుంది. మీకు మంచి నిద్ర ఉండాలంటే పడుకునే కంటే ముందు పూర్తిగా కాఫీ, టీలకు దూరంగా ఉండాలి.

అజీర్తి : కెఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు దారి తీయవచ్చు, ముఖ్యంగా ఎసిడిటీ, IBS వంటివి వస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల గుండెల్లో మంట, పొట్టలో పుండ్లు, అల్సర్ వంటి పరిస్థితులను తీవ్రతరం చేస్తుంది.

హృదయ సంబంధ వ్యాధులు : హృదయనాళ వ్యవస్థపై ప్రభావం చూపుతుందట కెఫెన్. హృదయ స్పందన రేటు, రక్తపోటు హార్ట్ బీట్ మీద ప్రభావం చూపిస్తుంటుందట.

మధుమేహం : కెఫీన్ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది కాబట్టి మధుమహం ఉన్నవారు తీసుకోవద్దు. ఇది రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్ స్థాయిలలో పెంచుతుందట.

నాడీ సంబంధిత వ్యాధులు : మూర్ఛ లేదా పార్కిన్సన్స్ వ్యాధి వంటి నరాల సంబంధిత మూర్యకు కారణం కాకపోయినా మూర్ఛ వచ్చినప్పుడు వణుకు రావడానికి కారణం అవుతుందట.

మూత్రాశయం నియంత్రణ సమస్యలు : కెఫిన్ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణ సమస్యలకు దారితీస్తుంది. దీని వల్ల అసౌకర్యం ఏర్పడుతుంది. కాబట్టి అవైడ్ కెఫెన్