Image Credit : google
నూనె లేకుండా చేసే కొన్ని వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
Image Credit : google
పప్పు : పప్పును కూడా నూనె లేకుండా వండవచ్చు. మసాలాను నాన్-స్టిక్ పాన్‌లో నీటితో ఉడికించి, ఆపై పప్పులో కలుపుతారు. చాలా టేస్టీగా ఉంటుంది.
Image Credit : google
చికెన్ మసాలా : మెరినేట్ చేసిన చికెన్‌ను నాన్-స్టిక్ పాన్‌లో వేసి, ఎక్కువ మసాలా వేసి బాగా ఉడికించాలి. ఈ వంటకం తక్కువ కొవ్వుతో ఉండి నూనె కూడా అవసరం లేకుండా చేయవచ్చు.
Image Credit : google
శెనగపప్పు కబాబ్ : శెనగపప్పు & సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేసే ఈ కబాబ్‌లను కొద్దిగా నూనె వేసి పాన్‌లో కాల్చుకోవచ్చు. లేదంటే ఆరోగ్యం కోసం ఎయిర్ ఫ్రైయర్‌లో ఉడికించుకోవచ్చు.
Image Credit : google
సెమోలినా కచోరి : కొన్ని కచోరీలను డీప్-ఫ్రై చేయాల్సిందే. కానీ ఈ సెమోలినా కచోరీలను ఆవిరిలో ఉడికించుకోవచ్చు. రుచికరమైన అల్పాహారం రెడీ అవుతుంది. అయితే ఇది ఎక్కువ యూపీ, బీహార్ లో కనిపించే వంటకం.
Image Credit : google
వెజిటబుల్ పులావ్ : నూనె లేకుండా వెజిటబుల్ పులావ్ ను రుచిగా తయారు చేసుకోవచ్చు. నూనె వాడే బదులు కుక్కర్‌లో పాలతో అన్నం వండుతారు.
Image Credit : google
మరి ఈ నూనెలేని వంటకాలను మీరు ఒకసారి ట్రై చేయండి. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యంతో పాటు కొవ్వు కూడా రాదు.
Image Credit : google