లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందంకి ఇద్దరు కుమారులు.

పెద్దబ్బాయి రాజా గౌతమ్ తండ్రి నట వారసత్వం తీసుకున్నాడు. 2004లో పల్లకీలో పెళ్లికూతురు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా రాజా గౌతమ్ కి బ్రేక్ రాలేదు.

ప్రస్తుతం ఆయన బిజినెస్ ప్రొఫెషన్ లో గొప్పగా రాణిస్తున్నాడట.

రాజా గౌతమ్ కి పలు కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయట. ఐటీతో పాటు ఎం ఎన్ సీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడట.

అలాగే బెంగుళూరులో రెస్టారెంట్స్ ఉన్నాయట. వివిధ వ్యాపారాల ద్వారా రాజా గౌతమ్ నెల సంపాదన రూ. 30 కోట్లకు పైమాటే అట.

అంటే రోజుకు కోటి రూపాయలన్న మాట. సినిమాకు వంద కోట్లు తీసుకునే హీరో కూడా   రాజా గౌతమ్ ముందు దిగదిడుపే..

పని చేసినా చేయకపోయినా రోజుకు కోటి రూపాయల ఆదాయం కలిగి ఉన్నాడు.

కాబట్టి రాజా గౌతమ్ ముందు స్టార్ హీరోలు కూడా దిగదుడుపే అని చెప్పొచ్చు.