https://oktelugu.com/

మట్టి కుండలు పాత్రలను ఇలా వాడితే త్వరగా పాడవవు

image credits google

వంటగదిలో మట్టి పాత్రలను వాడటం వల్ల వంటల రుచిని పెంచుకోవచ్చు. కానీ వీటిని ఉపయోగించేటప్పుడు కొన్ని చిట్కాలను గుర్తుంచుకోవాలి.

image credits google

మట్టి పాత్రలను, కుండలను సరిగ్గా వాడటం వల్ల వాటి కాలాన్ని పెంచవచ్చు. ఇంతకీ ఏం చేయాలంటే..

image credits google

నానాలి:  కొత్త మట్టి కుండలను, పాత్రలను ఉపయోగించే ముందు, వాటిని కొన్ని  గంటలపాటు నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత, పగుళ్లను నివారించడానికి  లోపలి భాగాలను నూనెతో రుద్దాలి.

image credits google

ఉష్ణోగ్రత మార్పులు: మట్టి కుండలను ఒక్కసారిగా వేడి చేయడం కంటే పగుళ్లను నివారించడానికి కొంచెం కొంచెం వేడి చేయడం అవసరం.

image credits google

చెక్క పాత్రలు: మీ మట్టి కుండల లోపలి భాగాన్ని రక్షించడానికి, మెటల్  పాత్రలకు బదులుగా చెక్క పాత్రలను ఉపయోగించండి. ఇవి సున్నితమైనవి. అంతేకాదు  అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు.

image credits google

తక్కువ వేడి మీద ఉడికించాలి: మట్టి కుండలు ఎక్కువ వేడిని తట్టుకోలేవు.  కాబట్టి తక్కువ మంటపై ఉడికించాలి. మట్ట తక్కువ పెట్టడం వల్ల వంట సరిగ్గా  ఉడుకుతుంది.

image credits google

సరిగ్గా శుభ్రం చేయాలి: బేకింగ్ సోడా, ఉప్పును ఉపయోగించి మీ మట్టి కుండలను  శుభ్రం చేయండి. కొబ్బరి స్క్రబ్బర్‌తో స్క్రబ్ చేయండి. కుండ ఉపరితలాన్ని  రక్షించడానికి డిటర్జెంట్లు, కఠినమైన సోప్ లను వాడకండి.

image credits google

పూర్తిగా ఆరబెట్టండి: కడిగిన తర్వాత, మీ మట్టి కుండలు, పాత్రలను పూర్తిగా  పొడిగా అయ్యేలా చూసుకోండి. వాటిని చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ ఉంచాలి.  ఇలా చేస్తే ఎక్కువ రోజులు బాగుంటాయి.

image credits google