మీరు డయాబెటిస్ తో బాధ పడుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే మీ రోజు వారి డైట్ ను కూడా కాస్త మార్చుకోవాలి. ఇంతకీ ఏంటంటే...

షుగర్ టెస్ట్ ను ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవాలి. దీని వల్ల మీ డయాబెటిస్ ను తెలుసుకోవడమే కాదు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు.

తక్కువ క్యాలరీలు ఉండే న్యూట్రిషన్ ఫుడ్ ను తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పండ్లు, కూరగాయలు వంటివి తీసుకుంటూ రొట్టె, బ్రౌన్ రైస్ వంటివి తినాలి.

మీ బరువును కంట్రోల్ లో ఉంచుతూ షుగర్ లెవల్ ను నార్మల్ గా ఉంచుకోవడానికి కచ్చితంగా ప్రతి రోజు వ్యాయామం చేస్తుండాలి. వాకింగ్, యోగా, స్విమ్మింగ్ వంటివి మర్చిపోవద్దు.

హెర్బల్ టీలను తాగుతూనే కొబ్బరి నీటిని కూడా తీసుకోవాలి. ముఖ్యంగా ప్రతి రోజు ఎనిమిది నుంచి పది గ్లాసుల వాటర్ ను కచ్చితంగా తీసుకోవాలి.

స్ట్రెస్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. మెడిటేషన్, డీప్ బ్రీతింగ్, వ్యాయామం, వంటివి చేస్తుండాలి. మీరు ఎంత పీస్ ఫుల్ గా ఉంటే అంత బాగుంటారని మర్చిపోవద్దు.

డయాబెటిస్ ఉన్నవారికి బ్లడ్ ఫ్లో, నరాల వ్యవస్థ డామేజ్ అయ్యే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా పాదాలకు కూడా సమస్యలు వచ్చే ఆస్కారం ఉందట. అందుకే వీటి రక్షణ కూడా ముఖ్యం.

రక్తంలో షుగర్ ను ప్రవహించకుండా చేయడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందట. అందుకే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.