ప్రస్తుత ఆహార అలవాట్లు, మారిన జీవన శైలి వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయి. అందులో చెడు కొలెస్ట్రాల్ మరింత పెద్ద సమస్యగా మారుతుంది.

ఈ కొవ్వును కరిగించుకోవడానికి చాలా కష్టాలు పడతారు. మరి దీన్ని ఎలా బర్న్ చేయవచ్చో కొన్ని టిప్స్ చూసేద్దాం.

వ్యాయామం: ఉదయం లేవగానే వ్యాయామం చేయడం కచ్చితంగా అలవాటు చేసుకోండి. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

నిమ్మకాయ నీరు : ఉదయం లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. దీని వల్ల రక్తం శుభ్రం అవుతుంది. టాక్సిన్లు తొలిగిపోతాయి. జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

బ్రేక్ ఫాస్ట్: మంచి బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రేక్ ఫాస్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఓట్స్, వాల్ నట్స్, అవకాడో వంటివి తీసుకోండి.

మెడిటేషన్ : మెడిటేషన్ వల్ల కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి, మానసికంగా బాగుంటారు. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.

సూర్యకాంతి: ఉదయం వచ్చే సూర్యకాంతి వల్ల విటమిన్ డి అందుతుంది. అంతేకాదు చెడు కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది.

నో కెఫెన్: కెఫెన్ తో నిండి ఉండే టీ కాఫీలకు దూరంగా ఉండటం బెటర్. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉదయం ఈ అలవాట్లను మానుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.