మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే. రోజు సరైన సమయంలో సరైన విధంగా నిద్రపోతేనేనే ఆరోగ్యం ఉంటుంది. లేదంటే వ్యాధులు చుట్టుముడతాయి. 

Image Credit : pexels

సరైన నిద్ర లేకపోతే మన రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా రోగాలమయం అవుతాం. అందుకే నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. 

Image Credit : pexels

రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోకపోతే కష్టాలు తప్పవు. సృష్టిలో ఏ ప్రాణి అయినా నిద్ర పోతుంది. తగినంత విశ్రాంతి తీసుకున్నాకే ఆహారం కోసం వెళ్తుంది.

Image Credit : pexels

నిద్ర లేమికి పలు కారణాలున్నాయి. మొదటిది సెల్ ఫోన్. ఇటీవల కాలంలో సెల్ ఫోన్ ను చూస్తూ కాలం గడిపేస్తుంటారు. దీంతో రాత్రిళ్లు సరిగా నిద్రపట్టడం లేదు.

Image Credit : pexels

రాత్రి సమయంలో ఎక్కువ సేపు సెల్ చూస్తుంటే నిద్ర పట్టడం కష్టంగానే ఉంటుంది. సెల్ చూడటం మానేయాలి.

Image Credit : pexels

నిద్ర పట్టాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమని కాగ్నిటివ్ బిహేవియరల్ థెరఫీ అంటారు. మంచి నిద్ర పట్టాలంటే బెడ్ పైకి వెళ్లాక ప్రశాంతంగా ఉండాలి. 

Image Credit : pexels

శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. మెల్లగా కళ్లు మూసుకుని శ్వాస తీసుకోవాలి. శ్వాస మీదే దృష్టి పెడితే మెల్లగా నిద్రలోకి జారుకుంటాం. ప్రశాంతమైన మనసుతో ఉంటే మంచి నిద్ర పడుతుంది.

Image Credit : pexels

బెడ్ రూం వెలుతురు లేకుండా ఉండాలి. చీకటిగా ఉంటే మంచి నిద్ర పడుతుంది. ఇంకా ఏదైనా పుస్తకం చదివితే బాగా నిద్రపడుతుంది. ఇలా చేయడం వల్ల మన కంటికి రిలాక్స్ గా ఉండి నిద్ర పట్టేందుకు కారణమవుతుంది. 

Image Credit : pexels

పడుకునే ముందు టీ లాంటివి తాగితే నిద్ర పట్టదు. మందు తాగినా నష్టమే. ఇలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Image Credit : pexels