మెదడుకు మేత పెడితేనే మరింత తెలివి పెరుగుతుంటుంది. దీని కోసం కొన్ని పనులు చేస్తుండాలి.

మీ తెలివి, ఆలోచన విధానం మారాలంటే.. మెదడు షార్ప్ అవ్వాలంటే చేయాల్సిన కొన్ని పనులు ఇప్పుడు తెలుసుకుందాం.

కొత్తది నేర్చుకోవడం:  సంగీతం నేర్చుకోవడం, ఏవైనా కొత్తవి కనిపెట్టడం, గిటార్ వంటివి నేర్చుకోవడం చేస్తుండాలి.

అల్లికలు:  బట్టలు, చీరలు, కర్చీఫులు, డోర్ మ్యాట్స్, స్వెటర్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వాటిని అల్లవచ్చు. ఒకసారి ట్రై చేయండి.

చదవడం:  బుక్స్ చదవడం అలవాటు చేసుకోండి. ఏదైనా చదువుతూ ఉంటే జ్నానం పెరగడం మాత్రమే కాదు మీకు చాలా రిలాక్స్ గా కూడా అనిపిస్తుంది.

గేమ్స్:  గేమ్స్ ఆడటం వల్ల శరీరానికి వ్యాయామం లాగా అవుతుంది. మీరు ఆలోచిస్తారు కాబట్టి బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది.

రాయడం:  ఏదైనా కొత్తది తెలుసుకొని రాయడం, లేదంటే ఒక విషయాన్ని కొత్తగా ఎవరు ఆలోచించని విధంగా రాయడం వల్ల కూడా మీ ఆలోచన విధానం మారుతుంది.

యోగా:  యోగా వల్ల కూడా మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మనసు, శ్వాసను ఒకటి చేస్తూ బ్రెయిన్ కూడా కామ్ గా ఉంచుతూ బ్రెయిన్ వ్యాయామాలు చేయడం వల్ల మీరు చాలా షార్ప్ అవుతారు.