విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. విజయం సాధిస్తే కచ్చితంగా ధనవంతులుగా మారతారు. మరి ధనవంతులుగా అవ్వాలంటే చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుందాం.

సోమరితనం: కష్టపడి పనిచేయడం, పట్టుదలతో పనిచేయడం వల్ల ఎలాంటి కష్టాన్ని అయినా ఎదుర్కోవచ్చు. మీ బిజినెస్, జాబ్ లో సక్సెస్ సాధిస్తారు. తద్వారా ధనవంతులు అవుతారు అందుకే సోమరితనం ఉండకూడదు.

ఆలస్యం: ఏ పనిని అయినా ఆలస్యంగా చేసే వ్యక్తులు అవకాశాలు, ప్రాజెక్ట్‌లను కోల్పోతారని, డబ్బును కూడా కోల్పోతారని చాణక్యుడు హెచ్చరించాడు. అందుకే ఆలస్యం ఉండకూడదు.

క్రమశిక్షణ: క్రమశిక్షణ లేకుండా కొందరు తాత్కాలిక ఆనందాలలో మునిగిపోతారని.. దీంతో దీర్ఘకాలిక విజయాన్ని కోల్పోతారని చాణక్యుడు నమ్మారు.

అపజయం: విజయం సాధించలేము కావచ్చు అనే భయం వల్ల కొన్నిసార్లు రిస్క్ తీసుకోరు. దీనివల్ల విజయం సాధించలేరు.  అంటే ధనవంతులు కాలేరు.

అజ్ఞానం: విద్య, జ్ఞానానికి చాలా ఎక్కువ విలువనిస్తారు చాణక్యుడు.. జ్ఞానం లేకపోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దీనివల్ల అవకాశాలను కోల్పోతారు.

ప్రణాళిక: ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్, జాగ్రత్త ప్రణాళిక విజయాన్ని సంపాదిస్తుంది అంటారు చాణక్యుడు. అందుకే ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రణాళిక అవసరం.

అస్థిరత: పట్టుదలగా, స్థిరంగా ఉండటం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చు. కానీ కచ్చితమైన నిర్ణయం, స్థిరత్వం లేని వారు విజయం సాధించలేరు అంటారు చాణక్యుడు.