కొంతమందిని చూస్తే వాడు బంగారంరా బుజ్జీ అంటారు. పొగడ్తలతో ముంచెత్తుతారు. కానీ కామన్ గా ఉండే కొందరి బంగారాల లక్షణం ఏంటో ఓ సారి చూసేద్దామా..

దయ: వీరికి విపరీతమైన దయ ఉంటుంది. ఎవరిని చూసినా జాలి పడుతుంటారు. కాస్త కష్టంలో ఉన్నారని తెలిస్తే కరిగిపోతారు.

కరుణ: చిన్న చిన్న విషయాలకే కనికరిస్తారు. నీకు దయ, జాలి, కరుణ లేదా అంటారు కదా. ఇదిగో ఇవి ఉన్నవారు బంగారమే.

నిస్వార్థం: కొందరు స్వార్థానికి మాత్రమే పని చేస్తుంటారు. ఆ పని చేస్తే మాకేంటి అనుకుంటారు. కానీ వీరు మాత్రం అలా కాదు. నిస్వార్థంగా ఉంటారు.

నిజాయితీ: ఏ పని చేసినా, ఏది మాట్లాడినా నిజాయితీగా మాట్లాడుతుంటారు. ఎదుటి వారి చెడును కోరుకోవడం, వీరి స్వలాభం కోసం ఆలోచించకుండా నిజాయితీగా ఉంటారు.

దాతృత్వం: అన్ని దానాల్లోకెల్ల అన్నదానం మిన్నా అంటారు. కానీ ముందుగా దానం చేసే గుణం ఉండాలి. ఎంగిలి చేతితో కాకిని కొట్టని వారు ఉంటారు. అందుకే దాతృత్వం ఉన్నవారు బంగారం.

ఓపిక : ఏ పని చేసినా, ఎవరితో మాట్లాడిన ఓపికగా ఉంటారు. అరవడం, కోపిష్టిగా ఉండటం వీరి లక్షణం కాదు. నిదానమే ప్రదానం అన్నట్టుగా ఓపికగా ఉంటారు.

మరి ఈ గుణాలు మీలో ఉన్నాయా? అయితే మీరు కూడా కొందరికి బంగారమే. మీ మంచి లక్షణాలతో ఎంతో మందిని సొంతం కూడా చేసుకున్నారు కదా.. లేదంటే మారండి..