ఆరు నెలలు నిండిన పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనేది తల్లిదండ్రులకు టాస్క్ కదా.

కొన్ని ఆహారాలను మాత్రమే వారికి ఇస్తుండాలి. లేదంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి

జీర్ణం అవ్వడం కూడా కష్టమే కాబట్టి పిల్లల ఆహారం విషయంలో ఆలోచించి తినిపించాలి. అవేంటంటే..

ఆవు పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని పిల్లలకు ఇవ్వకూడదు. తల్లి పాలతో పోలిస్తే వీటిని జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. అందుకే వీటిని అవైడ్ చేయాలి.

తేనెలో బొటలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పిల్లలకు సూట్ అవకపోతే పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు.

 షుగర్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని కూడా పిల్లలకు ఇవ్వకూడదు. దీని వల్ల ఒబేసిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పుప్పల్లు వచ్చే ఆస్కారం ఉంటుంది. డయాబెటీస్ కూడా వస్తుందట.

ఉప్పు ఇవ్వడం వల్ల పిల్లల కిడ్నీల మీద ప్రభావం చూపుతుంది. అందుకే సంవత్సరం లోపు పిల్లలకు ఉప్పును తినిపించకూడదు.

ఫ్రూట్ జ్యూస్ లలో షుగర్ ఎక్కువ ఉంటుంది. వీటిని పిల్లలకు డైరెక్ట్ గా ఇవ్వడం వల్ల ఆకలి తక్కువ వేస్తుంది. వీటిని ఫిల్టర్ చేసి ఇస్తుంటారు కాబట్టి ఫైబర్ వారికి అందదు. అందుకే వీటిని కూడా అవైడ్ చేయాలి.