చేపల కూరలో కొందరు పెరుగు వేస్తారు. లేదా చేపలు తిన్న వెంటనే పెరుగు తింటారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.

మామిడి కాయ తిన్న వెంటనే కూడా పెరుగు తినకూడదు. ఇలా చేస్తే అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు వస్తుంటాయి. 

బెల్లం పెరుగును కూడా ఎప్పుడు మిక్స్ చేయవద్దు. దీని వల్ల మీకు దగ్గు, జలుబు వస్తాయి. అంతేకాదు జ్వరం కూడా వచ్చే సమస్య ఉంది. 

పరాఠాను కూడా పెరుగుతో తింటారు కొందరు. ఇలా చేస్తే అజీర్ణంతో పాటు నీరసం వస్తుందట.

పాలు పెరుగు కలిపి అసలు తినకూడదు. ఇవి రెండు ఒకే జాతికి చెందినా వీటి వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తాయట.

చాయ్ పెరుగు కాంబినేషన్ ఎవరికి నచ్చదు. కానీ ఈ రెండింటిని ఏకకాలంలో కూడా తీసుకోవద్దు. లేదంటే జీవక్రియ వ్యవస్థలో అసమతుల్యత వస్తుంది. 

ఉల్లిపాయ పెరుగును మిక్స్ చేసినా కూడా మొటిమలు, చికాకు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి.