ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి రాత్రి నిద్ర చాలా అవసరం. అందుకే నిద్రపోయే ముందు కొన్ని అలవాట్లను మానుకోవాలి.

కొందరు పడుకునే కంటే ముందే కొన్ని విషయాలు ఎక్కువ ఆలోచిస్తుంటారు. దీని వల్ల కూడా నిద్ర పట్టదు.

ఆలస్యంగా తినడం:  రాత్రిపూట క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల నిద్ర పట్టదు. దీని వల్ల బరువు పెరుగుతారు కూడా.

స్క్రీన్ :  నిద్రపోయే ముందు స్క్రీన్ చూడకూడదు. ల్యాప్ టాప్, టీవీ, ఫోన్ వంటి వాటికి కాస్త దూరంగా ఉండాలి.

టీ, కాఫీలు:  నిద్రకు ముందు కెఫీన్ తీసుకోవడం వల్ల మీ శరీరంలోని మెలటోనిన్ స్థాయిలు ప్రభావితం అవుతాయి. నిద్ర లేకుండా చేస్తాయి. పడుకునే కంటే 6గంటల ముందు టీ, కాఫీలు తాగాలని అధ్యయనాలు చెబుతున్నాయి.  

హెవీ వర్కౌట్స్:  మితమైన, తేలికపాటి వ్యాయామాలు సరైనవి. కానీ నిద్రకు ముందు అధిక-తీవ్రతతో కూడిన వ్యాయామాలను నివారించాలి.

మద్యం:  పడుకునే కంటే ముందు మద్యం సేవించడం వల్ల తరచుగా మెలకువ వస్తుంది. దీని వల్ల మరుసటి రోజు అలసట, తలనొప్పి కూడా వేధిస్తాయి.

వీలైనంత ప్రశాంతంగా ఉండటం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. దీని వల్ల మరుసటి రోజు కూడా హుషారుగా ఉంటారు.