ఉప్మాను దక్షిణ భారతదేశంలో ప్రధానమైన అల్పాహారంగా సేవస్తారు. కూరగాయలతో కూడా దీన్ని తయారు చేస్తారు. రుచి చాలా బాగుంటుంది. కాస్త చట్నీతోని తింటే చాలు వావ్ అనిపిస్తుంది.
Image Credit : google
ఈ ఉప్మాను ఎన్ని రకాలుగా చేయవచ్చో తెలుసా? రకరకాలుగా ఉప్మాను చేయవచ్చు. అందుకే ఉప్మా చేసిన ప్రతిసారి ఒక్కో విధంగా రెడీ చేసి చూడండి. తిన్నకొద్ది తినాలి అనిపిస్తుంది. మరి ఓ సారి ఆ టైప్స్ ను తెలుసుకోండి.
Image Credit : google
క్వినోవా ఉప్మా : క్వినోవా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ కూడా ఉండే అల్పాహారం ఈ ఉక్మా. క్వినోవా ఉప్మా తేలికగా చేయవచ్చు.
Image Credit : google
మూంగ్ దాల్ ఉప్మా : దక్షిణ భారతదేశంలో పెసరపప్పు ఉప్మా ను చాలా మంది ఇష్టపడతారు. దీన్ని మరింత రుచికరమైన & పోషకమైనదిగా చేయడానికి కొన్ని కూరగాయలు లేదా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మరింత సూపర్ గా ఉంటుంది.
Image Credit : google
బ్రెడ్ ఎగ్ ఉప్మా : ఇది గేమ్ ఛేంజర్ లాంటిది. గుడ్లు, మినపప్పు, బ్రెడ్ ముక్కలతో చేసే ఈ ఉప్మా సూపర్ గా ఉంటుంది.
Image Credit : google
సోయాబీన్ ఉప్మా : మిల్ మేకర్ తో చేస్తారు ఈ ఉప్మాను. సోయాబిన్ కీమాతో చేయడం వల్ల సూపర్ గా ఉంటుంది. శరీరానికి ఆరోగ్యకరం కూడా.
Image Credit : google
సుజీ పనీర్ ఉప్మా : ఉప్మాకు పనీర్‌ను జోడించడం వలన దాని టేస్ట్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది. ప్రొటీన్లు అధికంగా ఉండే పనీర్ ఉప్మాని తప్పనిసరిగా ప్రయత్నించండి.
Image Credit : google
జొన్న ఉప్మా : ఫైబర్, ప్రోటీన్, అవసరమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉండే జొన్న ఉప్మా ఒక ఆరోగ్యకరమైన అల్పాహారం. రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ టిఫిన్ ను కూడా ఓ సారి ట్రై చేయండి.
Image Credit : google