కల్కి సినిమా  ట్రైలర్  రిలీజ్ చేశారు. ట్రైలర్ గమనిస్తే... ఇందులో ప్రభాస్ క్యారెక్టర్ ఎక్స్ ట్రా ఆర్డినరీ ఉండబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది.

మొదటి ట్రైలర్ విజువల్స్ పరంగా టాప్ నాచ్ లో కట్ చేసిన నాగ్ అశ్విన్  సెకండ్ ట్రైలర్ అనేది చాలా చప్పగా ఉంది.

కమలహాసన్ క్యారెక్టర్ ను సరిగ్గా రివిల్ చేయలేదు. కొంతవరకు క్లంజి తో కూడిన ట్రైలర్ నే వదిలారనిపిస్తుంది.

ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించినంత సేపు హై వోల్టేజ్ గా అనిపించిన కూడా తన క్యారెక్టర్ లోని ఆర్క్ ను రివిల్ చేయకుండా ఉంచాడు.

ఇక మరో వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసి అంచనాలను తగ్గించాలని చూశారా.? 

లేదంటే ట్రైలర్ లో చూపించాల్సిది ఇంతే అని చూపించి మిగితా విషయాలను దాచి ఉంచాడా  తెలియడం లేదు

ఇక ఇలాంటి సమయంలో నాగ్ అశ్విన్ కావాలనే ఇలాంటి చప్పటి ట్రైలర్ ను రిలీజ్ చేస్తే మైనస్ అవుతుంది..

మొత్తానికైతే సెకండ్ ట్రైలర్ కోసం విపరీతంగా ఎదురు చూసిన అభిమానులకు  కొంత అసంతృప్తి కలిగింది.