కొన్ని కూరగాయలు పచ్చి వాటికంటే ఉడికించిన తర్వాతనే వాటిలో మెండుగా పోషకాలు ఉంటాయట. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

ఉడికించిన తర్వాత పోషకాలు నశిస్తాయి కదా.. కానీ ప్రయోజనాలు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? అదే నిజం ఓ సారి చూసేయండి..

బచ్చలికూర: బచ్చలికూరలోని ఆక్సాలిక్ యాసిడ్ ఇనుము, కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. దీన్ని ఉడకబెట్టినప్పుడు, యాసిడ్ విచ్ఛిన్నమవుతుంది. అప్పుడు ఇది ఆరోగ్యకరంగా మారుతుంది.

చిలకడదుంపలు: తీపి బంగాళాదుంపలను ఉడకబెట్టడం వల్ల బీటా-కెరోటిన్ ఎక్కువగా అవుతుంది. పోషకాలు మరింత శోషించబడతాయట.

 పుట్టగొడుగులు : పుట్టగొడుగులలో యాంటీ ఆక్సిడెంట్ ఎర్గోథియోనిన్ ఉంటాయి. ఉడకబెట్టినప్పుడు ఇది విడుదల అవుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి.

గ్రీన్ బీన్స్: గ్రీన్ బీన్స్‌లో లెక్టిన్‌లు ఉంటాయి. అయితే ఇవి జీర్ణం కావడం కష్టం. ఉడికించవడం వల్ల లెక్టిన్‌లను న్యూట్రలైజ్ చేయడమే కాకుండా యాంటీఆక్సిడెంట్ కంటెంట్‌ను మెరుగుపరుస్తుంది.

వంకాయ:  వంకాయను కూడా ఉడికించి మాత్రమే తినాలి అంటారు పెద్దలు. అయితే ఉడికించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది ఓ అధ్యయనం.

పచ్చివి మాత్రమే కాదండోయ్.. ఉడికించినవి కూడా మంచివే. అందుకే మనం తినే ఆహారం మీద పూర్తి అవగాహన అవసరం అంటారు నిపుణులు.