Images source: google
ఈఫిల్ టవర్ పారిస్ అత్యంత ప్రసిద్ధ, ఐకానిక్ టవర్, దీనిని ప్రపంచం నలుమూలల నుంచి మిలియన్ల మంది పర్యాటకులు సందర్శిస్తారు.
Images source: google
మొదటిసారి పారిస్ వస్తున్నా లేదా ఇంతకు ముందు చాలాసార్లు సందర్శించినా సరే ఈఫిల్ టవర్‌ని సందర్శించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు.
Images source: google
మీరు కూడా ఈఫిల్ టవర్ చూడాలి అనుకుంటే ఓ సారి ప్యారిస్ చుట్టి రండి. అయితే ఈ అందమైన టవర్‌లో రహస్య అపార్ట్‌మెంట్ నిర్మించారు.
Images source: google
గుస్టావ్ ఈఫిల్ ఈ టవర్‌ను రూపొందించినప్పుడు, అతను దాని పైభాగంలో తన కోసం ఒక ప్రైవేట్ అపార్ట్మెంట్ను నిర్మించుకున్నారు.
Images source: google
రచయిత హెన్రీ గిరార్డ్ తన పుస్తకం లా టూర్ ఈఫిల్ డి ట్రోయిస్ సెయింట్-మీటర్స్‌లో ఈ అపార్ట్మెంట్లో నివసించడం గురించి వ్రాశారు.
Images source: google
ఈ పుస్తకం ప్రకారం, ఈఫిల్ తన అపార్ట్మెంట్లో ఎవరినీ నివసించడానికి అనుమతించలేదు. అతను ఒకసారి థామస్ ఎడిసన్‌ను అక్కడికి ఆహ్వానించారట కానీ ఉండటానికి కాదట.
Images source: google
ఇక్కడ నుంచి పారిస్ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది. దీని లోపలికి ఎవరినీ అనుమతించరు. కానీ టూర్ గైడ్ సహాయంతో బయటి నుంచి చూడవచ్చు.
Images source: google