తల్లిదండ్రుల పని సులభంగా ఉండటానికి పిల్లలకు డైపర్లు వేయడం చాలా అలవాటు అయింది.

మాడ్రన్ మామ్స్ అంటూ పిల్లల టాయిలెట్, మోషన్ ల విషయంలో పట్టింపు లేకుండా పోయింది.

ఎక్వువగా డైపర్లు వేయడం వల్ల పిల్లలకు చర్మ వ్యాధులు వస్తాయి అంటున్నారు నిపుణులు.

యూజ్ అండ్ త్రో డైపర్లు కాకుండా వాటర్ ప్రూఫ్ క్లాత్ డైపర్లను వాడటం మంచిది.

డైపర్లను వేసేకంటే ముందే పిల్లల గజ్జల్లో టాల్కమ్ పౌడర్ ను కచ్చితంగా వాడాలి.

ఇంట్లో ఉంటే డైపర్లు వేయకూడదు. బయటకు వెళ్లినప్పుడు అత్యవసరం అయితేనే డైపర్లు వేయడం మంచిది.

పిల్లలకు వదులుగా ఉండే గోచీలు, లేదా డ్రాయర్లు వేయడం మంచిది. అస్తమానం డైపర్లు వేయడం అసలు మంచిది కాదంటున్నారు నిపుణులు.

డైపర్లు వేసినా కూడా ప్రతి 4-5 గంటలకు మార్చాలి. ముఖ్యంగా తక్కువ రేటు అని నాసిరకం వాడకండి.