ఓ వైపు వర్షం, మరో వైపు చల్లని సాయంత్రం, అబ్బ వేడి వేడిగా ఏదైనా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. అందుకే ఈ డెజర్ట్ లతో మీ ఈవినింగ్ ను ఎంజాయ్ చేయండి.

ఆపిల్ పై: ఆపిల్ పై ఒక మంచి రెసిపీ. టార్ట్ యాపిల్స్, స్వీట్ కారామెల్, ఫ్లాకీ పేస్ట్రీ క్రస్ట్ లను కలిపి చేస్తారు కాబట్టి తినడానికి ఫేవరెట్‌గా అనిపిస్తుంది.

ఫెని/సుటర్ఫెని: వేయించిన వెర్మిసెల్లిని పాలలో ఉడికించి వేడి వేడిగా తింటే ఆల్ టైమ్ మాన్సూన్ ఫేవరెట్ అనిపిస్తుంది.

గులాబ్ జామూన్: నోట్లో వేయగానే మెత్త మెత్తగా జారిపోయేలా అనిపించే గులాబ్ జామూన్లు చల్లని వర్షపు సాయంత్రాలకు కిక్ ఇస్తాయి.

మాల్పువా: పంచదార పాకంలో ముంచిన స్వీట్ క్రిస్పీ పాన్‌కేక్‌లు పర్ఫెక్ట్ మాన్సూన్ డెజర్ట్ అనడంలో అతిశయోక్తి లేదు..

లడ్డూలు: అబ్బ చాక్లెట్ లడ్డూలు, ఇంట్లో పెద్ద వాళ్లు చేసే లడ్డూలు కూడా ఈ సాయంత్రాలను అందంగా మలుస్తాయి.

 హల్వా: నెయ్యి, పంచదార, రవ్వతో చేసే ఈ హల్వా కూడా వాహ అనిపిస్తుంది.

మరి  ఇంకెందుకు ఆలస్యం సాయంత్రాలు అయినా వర్షం వస్తున్నా ఈ డిజర్ట్ లను ఓ పట్టు పట్టేయండి..