విడిపోతూ కూడా ప్రేమను కురిపించేస్తే ఎలా ?

నెట్టింట ఇప్పుడు బ్రేకప్ కథలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని అందరూ ప్రముఖులు అయిపోతున్నారు. పైగా వీళ్లకు సోషల్‌ మీడియా‌ స్టార్స్‌ అంటూ ప్రత్యేక బిరుదులు కూడా తగిలిస్తున్నారు.

ఏది ఏమైనా దీప్తి సునయన, షణ్ముఖ్‌.. ఈ జంటకు సంబంధించిన వార్తే ఈ రోజు అంతా బాగా హల్ చల్ చేసింది. వీరిద్దరూ తమ ఘాడమైన ప్రేమ కథకు కలిసికట్టుగా బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.

ఎందుకు విడిపోతున్నారు అంటే ? అనుమానం అని కొందరు, షణ్ముఖ్‌ బాబు ‘బిగ్ బాస్ హౌస్’లో చేసిన రొమాన్స్ దెబ్బకు దీప్తి పాప బాగా ఫీల్ అయిందని మరికొందరు మొత్తమ్మీద చాలా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా వ్యక్తిగత కారణాలతో తమ ప్రేమ బంధానికి పుల్‌ స్టాప్‌ పెడుతున్నట్లు ఈ జంట ప్రకటించింది.

కానీ, విడిపోతూ కూడా ఒకరి పై ఒకరు అమితమైన ప్రేమను వ్యక్తపరచడమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

దీప్తి ఇన్‌స్టా వేదికగా పెట్టిన మెసేజ్ ను చూస్తే.. ‘నేను ఎంతో ఆలోచించి ప్రేమ బంధం నుంచి విడిపోతున్నాను. షణ్ముఖ్‌ నేను పరస్పర అంగీకారంతో మా దారులు మేము చూసుకోవాలని నిర్ణయించుకున్నాం.

మా దారులు వేరని అర్థమైంది’ అంటూ చాలా లోతుగా రాసుకొచ్చింది దీప్తి సునయన. అయితే, రాసిన ప్రతి లైన్ లోనూ షణ్ముఖ్‌ పై ప్రేమను చూపిస్తూనే ఉంది.