పగటి నిద్ర పనికి రాదని చెబుతుంటారు.  మధ్యాహ్నం నిద్ర పోతే మనకు రోగాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. 

Image Credit : pexels

ఎండాకాలమైతే ఓ పది నిమిషాల నుంచి అర గంట లోపు నిద్రపోతే ఫర్వాలేదు. అంతకుమించి నిద్ర పోతే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Image Credit : pexels

పగటి పూట నిద్రపోయే వారికి అధిక బరువు సమస్య పెరుగుతుంది. మధ్యాహ్నం ఎక్కువసేపునిద్ర పోవడం వల్ల కార్డియోవాస్కులర్ అనే వ్యాధి వస్తున్నట్లు చెబుతున్నారు. 

Image Credit : pexels

గంటల తరబడి నిద్ర పోవడం వల్ల రాత్రి సమయంలో నిద్ర పట్టక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దీంతో నిద్ర లేమి సమస్యకు గురవుతారు.  

Image Credit : pexels

ఇరవై ఏళ్లు పైబడిన వారు పగటి పూట నిద్ర పోకూడదు. 

చిన్న పిల్లలు అయితే ఫర్వాలేదు. వారి వయసు రీత్యా వారు నిద్ర పోవాల్సిందే. కానీ పెద్దవారు మాత్రం పగటి సమయంలో నిద్రపోతే పక్షవాతం లాంటి సమస్యలు రావచ్చు. 

Image Credit : pexels

మధ్యాహ్నం 90 నిమిషాల కన్నా ఎక్కువ సమయం నిద్రపోతే పలు రకాల వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయి. 

Image Credit : pexels

మధ్యాహ్నం పడుకునే వారు ఒంటి గంట నుంచి 3 గంటల వరకు ఎప్పుడైనా ఓ కునుకు తీస్తే మంచిదేనట. ఈ నిద్ర కూడా పది నిమిషాల నుంచి అరగంట లోపే ఉండాలి.

Image Credit : pexels