ఈ మధ్య చాలా మంది నాన్ స్టిక్ కడాయిల మీద వంట వండుతున్నారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు.

నాన్ స్టిక్ పాత్రల్లో వంట అడుగు అంటదు. మంచిగ అవుతుందని ఇందులోనే వండుతారు. కానీ సరైన దిశలో ఉపయోగించకపోతే సమస్యలేనట.

ఈ పాత్రలను సరిగ్గా ఉపయోగించకపోతే ఏకంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది ఐసీఎంఆర్. ఇంతకీ దీన్ని ఎలా వాడాలి అనుకుంటున్నారా? అయితే చూసేయండి.

వండే ఆహారం పాత్రలకు అతుక్కోవద్దని టెఫ్లాన్ కోట్ ను పెడుతుంటారు. ఇది కార్భన్, ఫ్లోరిన్ అణువులతో కూడిన రసాయనమట.

వెంబ్ఎండీ రిపోర్ట్ ప్రకారం టెఫ్లాన్ లో ఉండే ఫెరోఫ్లోరినేటెడ్ ఆక్టానోయిక్ ఆమ్లం కిడ్నీ, సంతానలేమి, కాలేయ వ్యాధులకు కారణం అవుతుందట.

వీటిని ఎక్కువ వేడి చేయడం వల్ల వంటల్లోకి విషపూరితమైన రసాయనాలు చేరి ఆరోగ్యానికి హానీ కలిగిస్తాయి.

ఆరోగ్యం బాగుండాలంటే మట్టి పాత్రలు, కోటింగ్ లేని గ్రానైట్ గిన్నెలు వాడాలి. నాన్ స్టిక్ ను వాడాలి అనుకుంటే వండేముందు కాస్త బేకింగ్ సోడా వేసి గోరువెచ్చని నీటితో కడగండి. రసాయనాలు పోతాయి.

ఈ గిన్నెలను ఎక్కువ హీట్ చేయడం మంచిది కాదు. పెద్ద మంట మీద కూడా వంట చేయవద్దట. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే టెఫ్లాన్ కోట్ కరికి హానికరంగా అవుతుంది.