జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ కొబ్బరి నూనెను తయారు చేసుకొని వాడండి

దీనికోసం కొబ్బరి నూనె, రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ సరిపోతాయి. ఇందులోని పోషకాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మరి ఈ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి.

కొబ్బరి నూనె : జుట్టును తేమగా, బలపరిచే సహజ కండీషనర్ కొబ్బరినూనె. రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ జుట్టు పెరుగుదలను ఉత్తేజపరిచి, స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

1/2 కప్పు కొబ్బరి నూనె తీసుకొని.. అందులో 10-15 చుక్కల రోజ్ మేరీ ఆయిల్ ను కలపండి. రెండు సరిగ్గా కలవాలి. అంతే మీకు కావాల్సిన మంచి ఆయిల్ రెడీ అయింది.

ఈ నూనెను తలకు అప్లే చేసి.. 5-10 నిమిషాల పాటు వృత్తాకారంగా సున్నితంగా మసాజ్ చేయండి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగు అవుతుంది.

మసాజ్ చేసిన తర్వాత, మిగిలిన నూనెను మీ జుట్టు చివర వరకు అప్లే చేయండి.

మంచి ఫలితాల కోసం రాత్రి ఈ నూనెను అప్లే చేసుకొని అలాగే వదిలేయండి. మీ జుట్టును తేలికపాటి షాంపూతో కడగి, ఎప్పటిలాగే కండిషన్ చేయండి. దీన్ని వారానికి 2-3 సార్లు అప్లే చేసుకుంటే సరిపోతుంది.

Read more