శనగపిండి చర్మ సౌందర్యంలో మంచి పాత్ర పోషిస్తుంది. రంధ్రాల నుంచి మలినాలను తొలగిస్తుంది. మరి ఈ శనగపిండికి పెరుగు, పెరుగుతో మరికొన్ని జోడిస్తే అందమే అందం అంటున్నారు నిపుణులు. మరి ఏం జోడించాలో చూసేయండి.

బేసన్-పెరుగు, గుడ్డు తెల్లసొన : ఈ ఫేస్ ప్యాక్ రంధ్రాలను బిగుతుగా చేసి ముడతలను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది.

Image Credit : google

నిమ్మకాయ- బెసన్-పెరుగు : క్లియర్ స్కిన్ కావాలనుకుంటే నిమ్మకాయను బెసన్, పెరుగుతో కలపాలి. ఇది సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌లా పని చేస్తుంది. డార్క్ స్పాట్స్,పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది.

Image Credit : google

బొప్పాయి :  బ్లాక్‌హెడ్స్‌ను వదిలించుకోవాలనుకుంటే, బొప్పాయిని బేసన్, పెరుగులో కలిపి వాడాలి. ఆ తర్వాత అద్భుతంగా మెరుస్తుంది స్కిన్.

Image Credit : google

అరటిపండు : మీకు డ్రై స్కిన్ ఉంటే శనగపిండి పెరుగుతో పాటు అరటి పండు కలపండి. మంచి ఫలితాలు ఉంటాయి.

Image Credit : google

బేసన్-పెరుగుతో టమోటా రసం : టొమాటోలు యాంటీ-టానింగ్‌లు పుష్కలంగా ఉంటాయి.  యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి చర్మాన్ని దృఢంగా, మృదువుగా మారుస్తాయి.

Image Credit : google

ముల్తానీ మిట్టి : కాస్మెటిక్ క్లే అదనపు చర్మ నూనెలకు ముల్తానీ మట్టి మంచి ఔషధం.  మలినాలను తొలగిస్తుంది. ఇక పెరుగు బీసన్‌తో కలిపినప్పుడు చర్మాన్ని చల్లబరుస్తుంది.

Image Credit : google

పసుపు- బేసన్-పెరుగు : పసుపులో యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలు, ఇన్ఫెక్షన్లను తొలగించి క్లియర్ స్కిన్ ను అందిస్తుంది.

Image Credit : google